- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Choppadandi MLA : రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం..
దిశ,చొప్పదండి: చొప్పదండి మండలంలోని రేవెల్లి, పెద్ద కుర్మపల్లె, దేశాయిపేట, మంగళపల్లి, చిట్యాల పల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక నేతలతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే (Choppadandi MLA) మేడిపల్లి సత్యం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సబ్సిడీపై మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లలను స్థానిక మత్స్యకారులు, అధికారులతో కలిసి చొప్పదండి కుడి చెరువులో విడుదల చేశారు.అనంతరం రూ. 72 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు అందచేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతీ రైతు చివరి గింజ వరకు కొనడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని, రైతులు సరైన తేమశాతంతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరను పొందాలన్నారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులకు కావల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మత్స్య సంపద పెంచడం కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడంతో పాటు మత్స్య కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు, మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ భూమిరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మత్స్య కార్మికులు పాల్గొన్నారు.