- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సమాజంలోని అసమానతలను తొలగించడమే సర్వే లక్ష్యం : మంత్రి పొన్నం
దిశ, వేములవాడ : సమాజంలోని అసమానతలను తొలగించి, అందరికీ సమాన న్యాయం చేయాలనే లక్ష్యంతోనే సర్వే జరుగుతుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ ఆర్థిక, సామాజిక సర్వే చేస్తున్నాం తప్పితే ఎలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం కాదని తెలిపారు. సోమవారం ఉదయం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజులతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని కోడేను కట్టేసి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు దెబ్బ కొట్టిందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీసీ కమిషన్ వేసిన లెక్కలు తేల్చిన అనంతరమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాకు ఇదే ప్రధాన కారణమని అన్నారు. బీసీలకు సంబంధించిన సమాచారం సేకరణ చేయాలని, ఒకవేళ అలా చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్క శాతం రిజర్వేషన్లు ఉండే అవకాశం లేదని, కేటీఆర్ కు చట్టం తెలియడం లేదని సుప్రీంకోర్టు తీర్పు తో సహా అన్ని పంపిస్తా చదువుకోవాలని కేటీఆర్ మీ హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కనీస అవగాహనతోనైనా కేటీఆర్ మాట్లాడాలని, ఈ సర్వే ఎన్నికలు, ఓట్ల కోసం చేస్తున్నది కాదని,
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జరుగుతున్న ప్రక్రియ అని, చాలా బాధ్యతగా సర్వే చేస్తున్నామని అన్నారు. బీసీలకు న్యాయం జరగడం ఇష్టం లేకపోతే బి.ఆర్.ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్రవ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్ ఇంటింటికీ తిరుగుతుంటే కొంతమంది దీనిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది అహంకారపూరితమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం ఎక్కడ ఆధార్, పాన్ కార్డు అడగడం లేదని, ఇష్టమైతేనే వివరాలు చెప్పొచ్చని, కులం చెప్పడం ఇష్టం లేకపోతే 999 ఆప్షన్ ఉందని, ప్రభుత్వ జీవో 18 ప్రకారం సర్వే కు వస్తున్న ఎన్యూమరేటర్ల విధులకు ఆటంకం కలిగిస్తే చట్టం తన పని తను చేసుకోపోతుందని హెచ్చరించారు. సమాచారం ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వద్దని ఇది బలవంతమైన సర్వే కాదని, బ్రతుకులు మార్చే సర్వే అని అన్నారు.
సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి ప్రభుత్వానికి దశ దిశ కోసం చేస్తున్న సర్వే అని,బీఆర్ఎస్ పార్టీలా అవసరం కోసం, రాజకీయం కోసం చేసిన సకల జనుల సర్వే కాదని గుర్తు చేశారు. ఈ సర్వే వివరాలు పబ్లిక్ డొమైన్ లో ఉంచి నిపుణులతో చర్చిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ లోని 25 మంది శాసనసభ్యుల్లో కేటీఆర్, హరీష్ తప్ప ఏ శాసనసభ్యుడు మాట్లాడడం లేదని, బీసీలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడే స్వేచ్ఛ బీఆర్ఎస్ పార్టీలో లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్, బీజేపీది ఒకటే డైరెక్షన్ అని, బీజేపీ రాముని పేరు , హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతుందని, ఈ రెండు పార్టీలు భయంతోనే సర్వేను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సమగ్ర కుటుంబ సర్వేపై గడిచిన 10ఎండ్లలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి ప్రశించలేదని, గతంలో బి.ఆర్.ఎస్ చేసిన సర్వే డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదని, సమగ్ర కుటుంబ సర్వే పై విచారణ జరిపించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందని, ఈ క్రమంలో ఎవరైనా జైలుకు వెళ్లాల్సి వస్తే వెళ్తారని, ఏ ఒక్కరు ఫిర్యాదు చేయకున్న కొన్ని సందర్భాల్లో సుమోటోగా స్వీకరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వారి వెంట జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహజన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, పర్యవేక్షకులు తిరుపతి రావు తదితరులు ఉన్నారు.