- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బాధితులకు పునరావాసం కల్పించాకే మూసీ ప్రక్షాళన
దిశ, జగిత్యాల ప్రతినిధి : మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రక్షాళన చేపడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల కార్నర్ మీటింగ్ లో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల పాలు చేసిందే బీఆర్ఎస్ అని, హరీష్ రావు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.
గత ప్రభుత్వం విడతల వారీగా కూడా రుణమాఫీ చేయలేదన్నారు. చేసిన కొద్దిగొప్ప మాఫీ డబ్బులు వడ్డీలకే సరిపోయేవని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ దొడ్డు వడ్లను నిషేధిస్తామంటే తాము సన్నాలకు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. రైతులపై భారం పడకుండా రూ.2 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం రూ.18 వేల కోట్లు వెచ్చించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ రైతులకు చేసింది ఏమీ లేదని, ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను మూసేయించారని, ప్రాజెక్టుల పేరుతో అందిన కాడికి దోచుకున్నారని విమర్శించారు. జగిత్యాలలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ చేసిందే అని, సిద్దిపేటకు కనీసం జేఎన్టీయూ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ అయినా తీసుకొచ్చావా అంటూ ప్రశ్నించారు. మంచి చేస్తే హర్షించాలి కానీ విమర్శించకూడదని హితవు పలికారు.
జిల్లాలో 65వేల కుటుంబాలకు రూ. 2 లక్షల రుణ మాఫీ : విప్ అడ్లూరి
జిల్లాలో 65 వేల కుటుంబాలకు రెండు రూ.లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసినట్లు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు పాదయాత్రలో వడ్ల కొనుగోలు మొదలు కాలేదు, రైతు రుణమాఫీ కాలేదు అంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సాంకేతిక కారణాలతో నిలిచిన రుణమాఫీ త్వరలోనే చేస్తామన్నారు.
రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగితే అప్పుడు సీఎం హోదాలో ఉన్న కేసీఆర్, మంత్రిగా ఉన్న హరీష్ రావు కనీసం బాధితులను ఎందుకు పరామర్శించలేదో సమాధానం చెప్పాలన్నారు. రూ.500 కోట్లతో ఆలయాలను అభివృద్ధి చేస్తానని అబద్దపు హామీలను ఇచ్చింది బీఆర్ఎస్ కాదా అన్నారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని రూ.ఏడు లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది వాస్తవం కాదా అని మండిపడ్డారు.