- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్.. జీతాల పై ప్రభుత్వం కీలక ప్రకటన
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం(AP Government) తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులకు సంబంధించిన జీతాల పై కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర సచివాలయ శాఖ(Department of State Secretariat) ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ విధానం నవంబర్ 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని తాజా నిర్ణయంలో మరోసారి అమలు చేయనున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి.. ఎన్నికల ముందు నిలిపివేశారు. తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం బయో మెట్రిక్ హాజరు విధానాన్ని తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. అంతకుముందు ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు ఉండేది.. కానీ కొన్ని సమస్యల కారణంగా ఈ విధానాన్ని పక్కన పెట్టినట్లు సమాచారం.