Phone Tapping Case: టేబుల్‌ మీద వెపన్ పెట్టి బెదిరించారు.. ఎమ్మెల్యే వీరేశం సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
Phone Tapping Case: టేబుల్‌ మీద వెపన్ పెట్టి బెదిరించారు.. ఎమ్మెల్యే వీరేశం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంపై నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Vemula Veeresham) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్(KTR) పాత్ర ఉందని ఆరోపించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినా నా గెలుపును ఆపలేకపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. బతుకుమీద ఆశ లేదా? అని తనను కేటీఆర్ బెదిరింపులకు గురిచేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. టేబుల్‌పై వెపన్ పెట్టి ప్రభాకర్ తనను బెదిరించే ప్రయత్నం చేశారని అన్నారు.

వికారాబాద్ లగచర్ల ఘటనలోనూ కేటీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. సురేశ్ కాల్ రికార్డింగ్‌లో కేటీఆర్ బండారం బయటపడిందని అన్నారు. కేటీఆర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు అందుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరు అయ్యారు. లింగయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్‌రెడ్డి విచారణ ఉండే ఛాన్స్‌ ఉంది.

Next Story

Most Viewed