- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amit Shah: ఎంవీఏ నేతలు ఔరంగజేబు అభిమానులు.. కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(MVA)పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇటీవల ప్రధాని మోడీ (Pm modi) అఘాడీ అవినీతిలో ఖలాఢీ అని వ్యాఖ్యానించగా.. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith shah) ఎంవీఏపై ఫైర్ అయ్యారు. ఎంవీఏ కూటమి నేతలంతా ఔరంగజేబు అభిమానుల సంఘం నాయకులని అభివర్ణించారు. రాష్ట్రంలోని ధూలేలో బుధవారం జరిగిన బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే (Udhav thakrey) తన తండ్రి బాల్ థాక్రే(Bal Thakresy) సిద్ధాంతాలను మరచిపోయారని ఆరోపించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించే పార్టీలతో ఉద్ధవ్ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు.
ప్రధాని మోడీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల జాబితాలో 11వ స్థానంలో ఉందని, కానీ మోడీ దేశాన్ని ఐదో స్థానానికి తీసుకువచ్చారని కొనియాడారు. 2027లో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని తెలిపారు. 10 ఏళ్ల సోనియా-మన్మోహన్ పాలనలో ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి స్వేచ్ఛగా వచ్చి ఇక్కడ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వవలసి వస్తే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు తగ్గించాల్సి ఉంటుందని, రాహుల్ నాలుగో తరం వచ్చినా ముస్లింలకు రిజర్వేషన్లు లభించబోవని కాంగ్రెస్ నేత ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.