- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Attack: చెన్నై నగరంలో దారుణం.. ప్రభుత్వ వైద్యుడిపై కత్తితో దాడి, పరిస్థితి విషమం
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ వైద్యుడిపై ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన చెన్నై నగరం (Chennai City)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విఘ్నేష్ (Vignesh) అనే యువకుడు తన తల్లికి చికిత్స చేయించేందుకు గిండి కలయాన్ సెంటినరీ ఆసుపత్రి (Guindi Kalayan Centenary Hospital)కి తీసుకెళ్లాడు. అయితే, అక్కడ ట్రీట్‌మెంట్ సరిగా చేయలేదని ఆగ్రహించిన విఘ్నేష్ (Vignesh) తన స్నేహితులతో కలిసి అంకాలజిస్ట్ డాక్టర్ బాలాజీ (Doctor Balaji)పై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
దీంతో గమనించిన తోటి వైద్యులు తీవ్రంగా గాయపడిన బాలాజీకి వెంటనే చికిత్స చేశారు. ఆయన హార్ట్ పేషెంట్ కావడంతో మరో 8 గంటల వరకు ఏమీ చెప్పలేమని వెల్లడించారు. ఈ ఘటన స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin) డాక్టర్ బాలాజీకి అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు. వైద్యుడిపై దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపేస్తున్నట్లు ప్రభుత్వ వైద్యులు ప్రకటించారు.