- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలి
దిశ, తంగళ్లపల్లి : రెసిడెన్షియల్ విద్యాలయాల్లో ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని అందించాలని ప్రిన్సిపాళ్లను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలోని తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా విద్యాలయం ఆవరణలో పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. అనంతరం కిచెన్ లోకి వెళ్లి కూరగాయలు, పండ్లు ఇతర పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. పలు కూరగాయలు, పండ్ల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లారు. ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తుండగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వారి సందేహాలు నివృత్తి చేశారు. నర్సింహులపల్లి, తంగళ్లపల్లిలోని ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుపై ఆరా తీశారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అంశాల్లో నిష్ణాతులను చేయాలని సూచించారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.