- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR: అదానీతో కేసీఆర్ ఫోటోలు వైరల్.. కేటీఆర్ రియాక్షన్ ఇదే
దిశ,తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : అదానీ అవినీతిపరుడని రాహుల్ గాంధీ ఢిల్లీలో విమర్శిస్తుంటే.. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్ కార్పెట్ పరుస్తున్నారని, మరి ముఖ్యమంత్రి నీతిపరుడు ఎలా అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. రాహుల్‌కు (Rahul Gandhi), ఏఐసీసీ పెద్దలకు తెలియకుండానే సీఎం అదానీ (Adani) కంపెనీతో ఒప్పందం చేసుకున్నారా? అని నిలదీశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తమ నాయకుడు రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెడుతూ సీఎం ఒప్పందం కుదుర్చుకున్నారు అనుకుంటే వెంటనే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. రాహుల్ గాంధీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అదానీతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవడంతోపాటు స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ సంస్థలు ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి పిచ్చివాగుడుకు తాము సమాధానం చెప్పమని, ఎక్కడకి వెళ్లినా ఆయనది అదే మొరుగుడు అని కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. సీఎంకు చేతనైతే సబ్జెక్ట్‌పైన, తాను లేవనెత్తిన ప్రశ్నలు, అదానీ అంశంపై మాట్లాడాలని సవాల్ చేశారు. అదానీతో తాము గతంలో ఫోటోలు దిగిన మాట వాస్తవమేనన్నారు. బరాబర్ ఫోటోలు దిగామని చెప్పారు. అదానీ వచ్చి కేసీఆర్ (KCR) ముందు ప్రతిపాదనలు పెట్టారని కానీ వాటిని తిరస్కరించారన్నారని చెప్పారు.
మహారాష్ట్రలో గజదొంగ.. తెలంగాణలో గజమాల...
తమ పదేళ్ల పాలనలో అదానీ తెలంగాణకు రాలేదని కానీ రేవంత్ ఆ సంస్థతో రూ. 12,400 కోట్లతో ఎంవోయూలు కుదుర్చుకున్నారని కేటీఆర్ విమర్శించారు. సీఎం ఇంట్లో అదానీ 4 గంటల పాటు చర్చలు జరిపారని అన్నారు. అదానీని అరెస్టు చేయాలని రాహుల్ గాంధీ అంటుంటే ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకోవడం లేదో తెలంగాణ సమాజానికి చెప్పాలన్నారు. ఇటీవల కోహినూర్ హోటల్‌లో మంత్రి పొంగులేటి, అదానీతో జరిగిన రహస్య సమావేశంపై రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో మొన్ననే అదానీని రేవంత్ గజదొంగ అని విమర్శించారని, అదే అదానీ తెలంగాణకు రాగానే గజమాలతో స్వాగతం చెప్పారని, ఇదేనా నీతి అని ప్రశ్నించారు.
కిషన్‌రెడ్డి.. మీ స్టాండేంటి?..
అదానీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ వైఖరి ఏంటో కిషన్‌రెడ్డి (Kishan Reddy) చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీతో ఢీ అంటే ఢీ అనేలా మాట్లాడుతుంటే తెలంగాణలో మాత్రం ఆ పార్టీ నేతలు రేవంత్‌రెడ్డితో డ్యూయెట్లు పాడుతున్నారని సెటైర్ వేశారు. అదానీ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకే వైఖరితో ఉన్నాయని విమర్శించారు.
కాలయాపన చేస్తే మళ్లీ కోర్టుకెళ్తాం..
ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన కేటీఆర్ రీజనబుల్ సమయంలో నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెప్పటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ కాలయాపన చేస్తే మళ్లీ ఖచ్చితంగా కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని కేటీఆర్ అన్నారు.