- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Supreme Court: సొంతంగా మీ కాళ్లపై నిల్చోవడం నేర్చుకోండి- సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు షాక్ తగిలింది. అజిత్ పవర్ కు సుప్రీంకోర్టు (Supreme Court)లో చుక్కెదురైంది. ఎన్సీపీ వ్యవస్థాపకుడైన శరద్‌పవార్ ఫొటోలు, వీడియోలు ఎన్నికల ప్రచారంలో వాడొద్దని ఆదేశించింది. అలాగే, అజిత్ పవార్ కి చురకలు అంటిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. “ సొంతంగా మీ కాళ్లపై మీరు నిల్చోవడం నేర్చుకోండి” అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
రెండుగా చీలిపోయిన ఎన్సీపీ
గతేడాది ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. అజిత్ పవార వర్గం, శరద్ పవార్ వర్గంగా విడపోయింది. అజిత్ పవార్ క్యాంపులో మెజార్టీ ఎమ్మెల్యేలు చేరగా.. ఆయనతో కలిసి బీజేపీ- షిందే సర్కారుకు మద్దతు పలికింది. ఆ తర్వాత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా, ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దాంతో పార్టీ రెండుగా చీలిపోగా.. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్‌సీపీగా ఎన్నికల సంఘం గుర్తించింది. అసెంబ్లీలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు కలిగిన అజిత్ వర్గమే పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును దక్కించుకుంది. అయితే, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే, ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ దృశ్యాలను అజిత్ వాడుతున్నారని ఆరోపిస్తూ ఆయన మద్దతుదారులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు అజిత్ పవార్ కు చురకలు అంటించింది.