Minister Ponnam : ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలి : మంత్రి పొన్నం

by Y. Venkata Narasimha Reddy |
Minister Ponnam : ధాన్యం కొనుగోలు సజావుగా నిర్వహించాలి : మంత్రి పొన్నం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు(Procurement of paddy)లో ఇబ్బందులు లేకుండా రవాణా శాఖకు సంబంధించిన లారీలు ఇతర వాహనాలను సమకూర్చేలా స్థానిక జిల్లా రవాణా అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమన్వయం చేసుకోవాలని రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ఆదేశించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద వాహనాల కొరత లేకుండా రవాణా శాఖ తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు.

జిల్లా కలెక్టర్లు స్థానిక రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడానికి వాహనాల కొరత లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story