అత్తింటివారే హత్య చేశారు.. చివరికి తల్లిదండ్రులే...

by Sathputhe Rajesh |
అత్తింటివారే హత్య చేశారు.. చివరికి తల్లిదండ్రులే...
X

దిశ, వెబ్‌డెస్క్: అత్తింటి వారే హత్య చేశారని, తన బిడ్డ మరణానికి కారణమైన భర్త, అత్తింటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన తల్లిదండ్రులే చివరికి చేసేదేమీ లేక ప్రమాదవశాత్తుగా బిడ్డ మృతి చెందినట్లు ఫిర్యాదు చేసిన ఘటన మండలంలోని మెట్ పల్లి గ్రామంలో చోటు గురువారం చేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన తోడంగ సారయ్య తన కుమార్తె అయిన సమతను, శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామానికి చెందిన బాకరం సదయ్యకు ఆరు సంవత్సరాల క్రితం ఇచ్చి వివాహం జరిపించారు. వివాహ సమయంలో ఏడు లక్షల రూపాయలు, 10 తులాల బంగారం పుట్టింటివారు సమతకు లాంఛనంగా అందజేశారు. కొన్ని నెలలే సమత సదయ్యల వైవాహిక జీవితం సాఫీగా సాగింది. నాటి నుండి నేటి వరకు సమతపై సదయ్య అనుమానాలు వ్యక్తం చేస్తూ చితకబాదిన ఘటనలు ఉన్నాయి. దీంతో సమత కుటుంబ సభ్యులు పలుమార్లు పంచాయతీలు నిర్వహించి అత్తగారింటికి పంపిన సందర్భం ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గత పదిహేను రోజుల క్రితమే పంచాయతీ నిర్వహించి, సమతను తల్లిగారు అత్తగారింటికి పంపినట్లు గ్రామస్తులు తెలిపారు. గురువారం కుటుంబ సభ్యులతో పొలం పనులకు వెళ్లిన సమత వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగింది. పొలం వద్దే ఉన్న భర్త సదయ్య, అత్త ఐలమ్మ చూసి కొనఊపిరితో ఉందని బావిలో నుండి సమతను పైకి తీసి చూడగా మృతిచెందడంతో, హుటాహుటిన భర్త సదయ్య సమత మృతదేహాన్ని ఇంటి వద్దకు తీసుకువచ్చినట్లు ప్రచారం జరిగింది. అనంతరం కేశవపట్నం పోలీసులకు ,సమత తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సమత భర్త సదయ్య రెండు గ్రామాల పెద్దమనుషుల జోక్యంతో తర్జనభర్జనలు చేసి చివరికి సమతప్రమాదవశాత్తు గా మృతి చెందినట్లు తండ్రి సారయ్య ఫిర్యాదు మేరకు కేశపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సమతకు ఇద్దరు కుమారులు కావడంతో కుమారుల భవిష్యత్తు కోసం సమత తల్లిదండ్రులు బిడ్డ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిందని ఫిర్యాదు చేయడం జరిగింది.

మంటగలిసిన మానవత్వం...

అన్నీ తెలిసి కన్నబిడ్డ మృతికి కాలమేనని చేసేదేమీలేక ఓ తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన శంకరపట్నం మండలంలో జరిగింది. ఆడబిడ్డ బిడ్డ పెళ్లి అత్తగారింటికి పంపించాలని, ఆడబిడ్డల తల్లిదండ్రులు చేతులను నేలపై వేసి కాయకష్టం చేసి, బిడ్డ వివాహ సమయంలో అత్తారింటి వారు కోరిన లాంఛనాలను అందజేసి వివాహం జరిపిస్తారు. అన్నీ తెలిసిన తల్లిదండ్రులు పెద్దమనుషుల ఒత్తిడితో, ఆ బిడ్డ ఇద్దరు కుమారుల భవిష్యత్తు కోసం, తన బిడ్డ సమత ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం చాలా బాధాకరమని పోరండ్ల, మెట్ పల్లి గ్రామాల్లో చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed