టీచర్ల కోసం విద్యార్థుల రాస్తారోకో..

by Aamani |
టీచర్ల కోసం విద్యార్థుల రాస్తారోకో..
X

దిశ, చిన్న శంకరం పేట : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శాలిపేట విద్యార్థులు శాలిపేట- గవ్వలపల్లి రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. చిన్న శంకరం పేట మండలం సాలిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 144 మంది విద్యార్థులు ఉండగా కేవలం ముగ్గురు టీచర్ మాత్రమే ఉన్నారు. దీంతోపాటు పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు.

ఈ పాఠశాల ప్రాథమిక పాఠశాల హై స్కూల్ ఒకే ప్రాంగణంలో నడుస్తుంది. ప్రాథమిక పాఠశాలలో ముగ్గురు టీచర్లు ఉండగా, 6 నుండి 10వ తరగతి వరకు 144 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యాభ్యాసం భావిస్తున్నారు. ఈ పాఠశాలలో కేవలం ముగ్గురు టీచర్లు ఉండడంతో విద్యాభ్యాసం ఎలా జరుగుతుందని విద్యార్థులు తదితరులు విద్యార్థులు శుక్రవారం గ్రామంలోని రోడ్డుపై రాస్తారోకో నిర్వహించగా వాహనాలు నిలిచిపోయాయి.ఈ పరిసర ప్రాంతాలలోని విద్యార్థులు కళాశాలకు వస్తున్న బస్సు ఈ రాస్తారోకో వల్ల ఆగిపోయింది. కళాశాల విద్యార్థులు కళాశాలకు రాలేకపోయారు.

ఈ విషయం తెలుసుకున్న ఇన్చార్జి మండల విద్యాధికారి బుచ్చయ్య నాయక్ పాఠశాల చేరుకొని ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రావును అడిగి తెలుసుకొని రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు వద్దకు వెళ్లి విద్యార్థులను సముదాయించారు. ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ ఉన్నందున మరో 15 రోజుల్లోపు ఇరువురికి టీచర్లను పాఠశాలకు పంపిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారోకో వివరించారు విరమించారు.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్,మాజీ సర్పంచ్ సాయం పోచయ్యతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed