మహిమలు చూపుతున్న హనుమాన్ విగ్రహం.. చేతిలో లింగం, ఛాతీపై సీతారాములు

by Aamani |
మహిమలు చూపుతున్న హనుమాన్ విగ్రహం.. చేతిలో లింగం, ఛాతీపై సీతారాములు
X

దిశ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల జిల్లాలోని ఓ ఆలయంలో హనుమాన్ విగ్రహం మహిమలు చూపుతోంది. జిల్లాలోని తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీ హనుమాన్ ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ హృదయ ప్రదేశంలో శ్రీ సీతారాముల విగ్రహాలు, కుడి చేతిలో శివలింగాన్ని పోలినట్లు చూపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆంజనేయ స్వామి తాను చిరంజీవి ననే విధంగా నిరూపిస్తూ తన మహిమలు చూపిస్తున్నాడని స్థానికులు విశ్వసిస్తున్నారు.

గత 10 సంవత్సరాల క్రితం ఆంధ్ర రాష్ట్రంలోని తిరుపతిలో తయారుచేసిన ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహాన్ని 2014లో శ్రీ అభయ ఆంజనేయ శివ పంచాయతన దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతిష్టించారని, అప్పటినుండి భక్తులతో నిత్య పూజలు స్వామి విగ్రహ రూపంలో అందుకుంటున్నారని ఆలయ పూజారి బాలయ్య పంతులు చెప్తున్నారు. స్వామివారి విగ్రహంలో గురువారం నుండి వింతలు జరుగుతున్నాయని, అంజన్న స్వామి మహిమలు చూపుతున్నాడని, విగ్రహంలో వింతలు చోటు చేసుకున్న దృశ్యాలు చూసి కాలనీవాసులకు భక్తులకు ఆయన తెలిపాడు. దీంతో స్వామివారి విగ్రహాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లి ఆంజనేయస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed