- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో అరుదైన, ప్రాచీన దేవాలయం..
దిశ, జగిత్యాల రూరల్: జిల్లాలోని జగిత్యాల రూరల్ మండలానికి 7 కి.మీ. దూరంలో ఉన్న తాటిపెళ్లి గ్రామంలో ఒక కొండపై అరుదైన, ప్రాచీన దేవాలయం ఉంది. జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న ఈ కొండపై అప్పన్న స్వామిగా నరసింహ స్వామి పూజలందుకుంటున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏకైక దేవాలయం కాగా, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో రెండో దేవాలయంగా ఉంది. ఆంద్రప్రదేశ్ లో ఉన్న సింహాచలం అప్పన్న స్వామి గొప్ప పుణ్యక్షేత్రంగా ఉండగా, ఇక్కడ మాత్రం దేవాలయం ఎవరికి తెలియకుండా పోవడం కొసమెరుపు. ఇంతటి ప్రాధాన్యత కల్గిన దేవాలయంను కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అభివృద్ధి చేయకుండా పోవడం బాధాకరం.
ఆలయ చారిత్రక నేపథ్యం...
రూరల్ మండలం తాటిపెళ్లి గ్రామంలో జాతీయ రహదారి నుండి 100 మీటర్ల దూరంలో ఒక కొండ పైన అద్భుతమైన చాళుక్యుల కళారీతుల్లో ఉన్న ప్రాచీన విగ్రహాలు ఉన్నాయి. గుడి మాత్రం ఇప్పటికీ కట్టలేదు. కొండ పై చదునుగా ఉన్న చతురస్రాకర వేదికపై 9, 10 శతాబ్దంకు చెందిన వైష్ణవ, శైవ సంప్రదాయ విగ్రహాలు ఉన్నాయి. ఇచట ప్రధాన ఆరాధ్య దైవం అప్పన్న స్వామి అంటే నరసింహ స్వామి, సింహాచలంలోని అప్పన్న స్వామిని విశాఖపట్నం ప్రజలు నరసింహ స్వామిగా పిలుస్తారు. సింహాచలంను తూర్పు చాళుక్యులు పాలించగా, ఈ తాటిపెళ్లి వేములవాడ చాళుక్యులు పరిపాలించారు.
ఈ కొండపై ఉన్న విగ్రహాలు పరిశీలిస్తే నరసింహ స్వామి అంటే అప్పన్న స్వామి విగ్రహం. ఒక గ్రానైట్ వేదికపై ఉండి శంకు, చక్రాలు ధరించి అసను కాలుపై కూర్చొని, నోరు విశాలంగా తెరుచుకుని, కింది పెదవి పై దంతాలు ఆగబడుచున్నవి, స్వామి మకూతధారణ దర్శనమిస్తాయి. ఈ స్వామి వారి ప్రక్కన బైరవుడు అంటే పరమ శివుని మరో రూపం. శైవ రూపంలో నగ్నంగా ఉండీ నాలుగు చేతులు కలిగి ఢమరుకం, త్రిశూలం ఉన్నాయి. మరో రెండు విగ్రహాలు గణపతి, వైష్ణవ విగ్రహం కలవు. ఇలాంటి విగ్రహాలు వేములవాడ దేవస్థానం నందు కనిపిస్తుంది. చాళుక్యులు కాలపు ఇచ్చటి విగ్రహాలు తటిపెళ్ళిలో వెయ్యి సంవత్సరాల పూర్వమే హరిహారారాదన కేంద్రంగా శోబిల్లిన గ్రామం అని తెలుపుటకు ప్రబల నిదర్శనం.
తాటిపెళ్లి నుండి కొండ పైకి కాలి నడకన, బైక్, వాహనాలపై వెళ్ళవచ్చు. చుట్టూ ఆకుపచ్చని గుట్టలు, మనోహరమైన చెట్లు, తాటివనాలు, దూరంగా కనిపించే చెరువులు, చేనులు, పంట పొలాలు, పక్షుల కిలకిలలు, ప్రకతి రమణీయత ఇనుమడింప జేస్తుంటది. జగిత్యాల జిల్లాలో గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడు అయినా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.