police : వృద్దున్ని కాపాడిన సిరిసిల్ల పోలీసులు..

by Sumithra |
police : వృద్దున్ని కాపాడిన సిరిసిల్ల పోలీసులు..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ కాలనీకి చెందిన గుంటుక రాజయ్య (81) అనే వృద్ధుడు గత మూడు రోజులుగా కనబడటం లేదని, తన కుటుంబ సభ్యులు డయల్ 100 కాల్ కి సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో సిరిసిల్ల టౌన్ ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బంది బన్సీలాల్, ఉమాపతి, ఎల్లగౌడ్, రాజేందర్, శ్రీధర్ లు రాజయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని వంశీ కృష్ణ కాలనీలో వర్షపు నీటిలో స్పృహ తప్పి పడిపోయి ఉన్న రాజయ్యను పోలీసులు వెంటనే 108 కాల్ చేసి అంబులెన్స్ కు సమాచారం అందించి, సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి రాజయ్యను తన కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Next Story