ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా.. మంత్రి గంగుల కమలాకర్

by Sumithra |
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా.. మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ : పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే ప్రప్రథమంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన గొప్ప పథకం న్యూట్రిషన్ కిట్ అని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం రోజున కాంప్రెన్సివ్ లాక్టాషన్ మానేజ్మెంట్ సెంటర్ ను, న్యూట్రిషన్ కిట్ పంపిణి కార్యక్రామాన్ని జిల్లా కలెక్టర్, నగర మేయర్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పుట్టబోయే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, అమ్మ కాబోతున్న ప్రతి మహిళ రక్తహీనతను అరికట్టడానికి హార్లిక్స్, ఐరన్, సిరప్, ఖర్జూరం, నెయ్యి, పల్లి చిక్కి వంటి బలవర్ధకమైన పోషకాహారాలతో పాటు హర్లిక్స్ త్రాగడానికి కప్పు, వస్తువులను అమర్చుకోడానికి బాస్కెట్ మొత్తం 3వేల విలువగల న్యూట్రిషన్ కిట్ లను రెండవ, మూడవ చెకప్ లు చేయించుకున్న తరువాత అందించుకోవడం జరుగుతుందని, ఎక్కడైన పుట్టిన బిడ్డల గురించి పథకాలను ఆయారాష్ట్రాలు ప్రవేశపెడితే, భారత దేశంలోనే మొట్టమొదటి పథకం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకమని మంత్రి కొనియాడారు. తెలంగాణ ఆవిర్బావానికి పూర్వ, ప్రస్తుతం అని బేరిజు వేసుకుంటే ప్రవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే వైద్యం పై ప్రజల్లో నమ్మకం పెరిగి, వైద్యంకోసం వచ్చేవారితో ప్రభుత్వ ఆసుపత్రులన్ని కిక్కిరిసిపోతున్నాయన్నారు.

గతంలో విద్యకు, వైద్యానికి ఆదరణ లేక వ్యవస్థలు కుంటుపడిపోయాయని, తెలంగాణాను సాధించుకున్న తరువాత విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చామని తెలిపారు. గర్బిణీలు కాన్పుకోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెలితే వీపరీతంగా ఫీజులు వసూలు చేసే వారని, ఇప్పుడు ఒక్కరూపాయి కూడా కట్టాల్సిన అవసరంగాని ప్రసవం కోసం ఆపరేషన్ చేసే అవసరం లేకుండా నాణ్యమైన ఉచిత ప్రసవాన్ని చేస్తున్నారని మంత్రి తెలిపారు. అంతకుముందు మాతాశిశు కేంద్రంలో అనారోగ్యంతో పాలుపడని బాలింతల నుండి పాలుతీసి నవజాతశిశువులకు ముర్రుపాలు పట్టించే ల్యాక్టేషన్ మానేజిమెంట్ యూనిటే, త్వరలో కాంప్పెన్సీవ్ లాక్టేషన్ మెనేజిమెంట్ సెంటర్ ను ప్రారంబించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో 20 మంది గర్బిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ లను అందించడంతో పాటు కేసీఆర్ కిట్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెటర్ ఆర్.వి.కర్ణన్, నగర మేయర్ వై. సనీల్ రావు, గ్రందాలయ చైర్మన్ పోన్న ఆనీల్, జిల్లా వైద్యాధికారి కే.లలితాదేవి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపింటెండెంట్ డాక్టర్ ఎల్ కృష్ణ ప్రసాద్, ఆర్ఎంఓ డాక్టర్ జ్యోతి, డాక్టర్ అలీ, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story