రక్తదానం చేసి మహిళ ప్రాణాలను కాపాడిన ఎస్సై

by Shiva |
రక్తదానం చేసి మహిళ ప్రాణాలను కాపాడిన ఎస్సై
X

ఆపద సమయంలో వెల్లివిరిసిన మానవత్వం

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి:ఆపద సమయంలో ఓ పోలీసు రక్తదానం చేసి మహిళ ప్రాణాలు కాపాడిన ఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి వేళల్లో ఎస్సై రాజేష్ తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముస్తాబాద్ బస్టాండ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్, అతని భార్య అనారోగ్యంతో పట్టణంలోని పీపుల్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.

అర్ధరాత్రి బీ పాజిటివ్ బ్లడ్ అత్యవసరం ఉందని ఈ రాత్రి వేళలో ఏం చేయాలో అర్థం కాకా శ్రీనివాస్ గౌడ్ అక్కడే డ్యూటీ చేస్తున్న ఎస్సై రాజేష్ కు తెలిపాడు. దీంతో స్పందించిన ఎస్సై తనది కూడా బీ పాజిటివ్ బ్లడ్ గ్రూపేనని, వెనువెంటనే డ్యూటీలో ఉండగానే ఆయన ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశారు. చికిత్స పొందుతున్న మహిళకు సరైన సమయంలో రక్తదారం చేసి మానవత్వం చాటుకున్న ఎస్సై రాజేష్ కు శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు కూడా ఎస్సై రాజేష్ ను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story