- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దాసు'' లైంగిక వేధింపులు నిజమే.. విచారణలో తేల్చేసిన నాయకులు
దిశ, గోదావరిఖని: కార్మికుల కోసం అధికారులతో మాట్లాడి కార్మిక సమస్యలు పరిష్కరించాల్సిన ఓ కార్మిక సంఘం నేత ఓ మహిళా పట్ల వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారి సింగరేణి వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలే గుర్థింపు సంఘం ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో కార్మికులతో ఎప్పటికప్పుడు ఆధినాయకత్వం నాయకులూ సమావేశాలు ఏర్పాటు చేస్తుంటే.. దీనికి భిన్నంగా వ్యవహరించిన సదురు నాయకుడికి ఓ మహిళా తనదైన శైలిలో గుణపాఠం చెప్పిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అర్జీ-1లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అప్పటి నుండి ఇటు కార్మిక సంఘం నాయకులతో పాటు సింగరేణి అధ్వర్యంలో విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అధికారులు సైతం జరిగిన లైంగిక వేధింపులు నిజమే అని ప్రకటన సైతం విడుదల చేశారు. వివరాల్లోకి వెళ్తే... అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అర్జీ-1లో ఫిట్ సెక్రటరీగా పని చేస్తున్న స్వామిదాస్ కార్మికుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే స్థానికంగా పని చేసే ఓ మహిళా పట్ల సదురు నాయకుడు నిత్యం సెల్ ఫోన్ లో మెస్సెజ్ లు పెడుతూ లైంగిక వేధింపులకు గురి చేయడంతో తన బాధ ఎవరితో చెప్పుకున్నా పరిష్కారం కాకపోవడంతో ఏకంగా సదురు మహిళా అధికారుల సాక్షిగా తన చెప్పులతో బడిత పూజ చేసింది.
ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉన్న అధికారులు షాక్ గురయ్యారు. కళ్లుమూసి తెరిచే లోపే సదురు మహిళా తనదైన శైలిలో చెప్పులతో సమాధానం చెప్పడంతో ఈ వార్త ఒక్కసారిగా సింగరేణి వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వెంటనే స్పందించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులూ సదురు నాయకుడిని కార్మిక సంఘం నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సింగరేణి యాజమాన్యం సైతం స్పందించి విధుల్లో నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది. ఇది ఎలా ఉంటే.. ఈ ఘటనపై వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అధిష్టానం నుండి ఆదేశాలు రావడంతో విచారణ చేప్పట్టిన టీబీజీకేఎస్ నాయకులు.. జరిగిన దానిపై అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. అయితే దీనిపై సింగరేణి యాజమాన్యం సైతం అర్జీ-1 ఏరియా ఇంటర్నల్ కంప్లేట్స్ కమిటీ ఐసిసి అంతర్గత విచారణ కమిటీ లైంగిక వేధింపుల నివారణ చట్టం -2013 ప్రకారం విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. విచారణ కమిటీ తగు సాక్షాధారాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.