మల్యాలలో రెండోరోజు సిట్ అధికారుల విచారణ

by Shiva |
మల్యాలలో రెండోరోజు సిట్ అధికారుల విచారణ
X

దిశ, మల్యాల: టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మల్యాల మండలంలో రెండో రోజు సీట్ అధికారుల విచారణ కొనసాగింది. ఈ నేపథ్యంలో మొత్తం 8 మంది గ్రూప్ 1 పరీక్ష రాసిన అభ్యర్థులను అధికారులు ప్రశ్నించారు. అనుమానం వచ్చిన 42 అభ్యర్థులలో దాదాపుగా 16 మందిని విచారించారు. మిగిలిన అభ్యర్థులను శుక్రవారం రోజు విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కీలక అభ్యర్థుల నుంచి అందిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story