అటకెక్కిన ‘ఛాలెంజ్’.. అవార్డుల కోసం అధికారుల అగచాట్లు

by Aamani |
అటకెక్కిన ‘ఛాలెంజ్’.. అవార్డుల కోసం అధికారుల అగచాట్లు
X

దిశ బ్యూరో, కరీంనగర్ : ప్రచార ఆర్బాటాలతో ప్రభుత్వాలనే బోల్తా కొట్టించి అవార్డులను అందుకున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆపై పారదర్శకత కు తిలోదకాలు ఇవ్వడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అవార్డు పొందేందుకు లక్షల రూపాయలు వెచ్చించి వాల్ రైటింగ్ పెయింటింగ్ హోర్డింగ్ ల ప్రచారంతో నగరవాసులను అటు ప్రభుత్వాన్ని నమ్మించి కోట్ల రూపాయల ప్రైజ్ మనీ కొట్టేసిన అధికారులు ఆపై పథకాన్ని పక్కన పడేశారు. పారదర్శకతకు తిలోదకాలు ఇస్తూ టోల్ ఫ్రీ నెంబర్ పక్కన పడేయడం బల్దియాలో అధికారుల పనితీరు కు అద్దం పడుతున్నాయి. కాగా అధికారుల ప్రకటనలు నమ్మి సేవలను వినియోగించుకుంటున్న నగరవాసుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

పనిచేయని టోల్ ఫ్రీ నెంబర్ 14420

నగరవాసులకు మెరుగైన సేవలు అందిస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి ప్రైజ్ మనీ కొట్టేసిన నగర పాలక సంస్థ అధికారులు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థతో నగర వాసుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అయితే బల్థియా అధికారులు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ప్రత్యేక ధరను నిర్దేశించిన ప్పటికీ పనిచేయని టోల్ ఫ్రీ నెంబర్ 14420 పనిచేయకపోవడంతో సదరు వాహన యజమానులు నగరవాసుల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు లాగేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

బిల్లులు చెల్లించకపోవడంతో నిలిచిన సేవలు : స్వామి, మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్

టోల్ ఫ్రీ నంబర్ బిల్లులు చెల్లించకపోవడంతో టోల్ ఫ్రీ సేవలు నిలిపివేయబడ్డాయి. సేవలు నిలిచిపోయి వారం రోజులు అవుతుంది. కమిషనర్ సెలవులో ఉండటంతో సేవలను పునరుద్దరించడానికి సమయం పట్టింది. మరో రెండు రోజుల్లో టోల్ ఫ్రీ సేవలు ప్రారంభమవుతాయి. అప్పటి వరకు నగరవాసులు కరీంనగర్ సిటిజన్ బడ్డి యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని అందులో ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంది..అది వినియోగించుకోవాలి.

Next Story

Most Viewed