- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదలకు అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు పల్లె, బస్తీ దవాఖానాలు : మంత్రి గంగుల కమలాకర్
దిశ, కరీంనగర్ : పేదలకు అత్యుత్తమ వైద్య సేవలందించేందుకు పల్లె, బస్తీ దవాఖానాలు అందుబాటలోకి తీసుకొచ్చినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని తీగలగుట్టపల్లి గ్రామం 1వ డివిజన్ లో బస్తీ దవాఖానా, పల్లె దవాఖానాలను జడ్పీ చైర్మన్, కలెక్టర్, మేయర్లతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
అనంతరం.. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జిల్లా మానసిక ఆరోగ్య చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజలు వైద్యం కొసం ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందే విధంగా ఆసుపత్రులను, వైద్య కళాశాలలను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించిందని తెలిపారు. కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, భాగ్యలక్ష్మి తదితర పథకాలతో వివిధ ఆరోగ్య సూచీలో తెలంగాణ రాష్ట్రం అద్భుత పురోగతిని సాధించిందన్నారు.
ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువు చేసేలా 5 వేల నుంచి 10 వేల లోపు జనాభా గల నాన్ మెట్రో యూఎల్బీల్లో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ దవాఖానాలను శనివారం మినహ అన్ని రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలపై వైద్యులు ఎక్కవ శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై.సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.