శక్తిశాలి భారత్ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం: నర్రా శివకుమార్ జీ

by Shiva |
శక్తిశాలి భారత్ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం: నర్రా శివకుమార్ జీ
X

దిశ, జగిత్యాల టౌన్: శక్తిశాలి భారత్ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని, ఆ దిశగా నిత్య శాఖా మాధ్యమంగా వ్యక్తి నిర్మాణ యజ్ఞం నిత్యం సాగుతోందని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సహా బౌద్ధిక్ ప్రముఖ్ నర్రా శివకుమార్ జీ అన్నారు.ఆర్ఎస్ఎస్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం శారీరిక్ ప్రధాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న శివకుమార్ జీ మాట్లాడుతూ వ్యక్తుల్లో శారీరిక, మానసిక వికాసాన్ని పెంపొందించి దేశభక్తి పౌరులుగా తీర్చిదిద్దే పని గత 97 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ చేస్తుందన్నారు.

దేశాన్ని సాంస్కృతికంగా దెబ్బ తీసేందుకు బ్రిటిష్ వారు మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి మన గొప్ప చరిత్ర ను మనకు చెప్పకుండా దాచి పెట్టారని తెలిపారు. మన గొప్ప చరిత్రను మనము తెలుసుకొని దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దే పని ఆర్ఎస్ఎస్ చేస్తుందన్నారు. రాబోయే రెండెళ్లలో ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటుందన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా దేశంలో లక్ష గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు విస్తరించేలా ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు.

అంతకు ముందు నగర ప్రధాన వీధుల గుండా పథ సంచలనం (రూట్ మార్చ్) నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘ చాలాక్ డా.భీమనాతిని శంకర్, సహ సంఘ చాలాక్ డా.శ్రీనివాస్ రెడ్డి, నగర సంఘ చాలక్ జిడిగే పురుషోత్తం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి ప్రవీణ్, పలువురు బీజేపీ నాయకులు స్వయం సేవకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed