- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ సాగు నీటి రంగంలో విప్లవాత్మక మార్పులు : కలెక్టర్ ఆర్.వీ కర్ణణ్
దిశ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం సాగునీటి రంగంలో విప్లవాత్మకమైన మార్పులు జరిగాయని జిల్లా కలెక్టర్ ఆర్.వీ. కర్ణన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో బాగంగా సాగు నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కేంద్రంలోని వీ కన్వేన్షన్ హల్లో నిర్వహించిన సాగునీటి దినోత్సవానికి జిల్లా కలెక్టర్ ముఖ్య ఆతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు.
కాలేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. రూ.410 కోట్లతో జిల్లాకు తలమాణికంగా నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ ఇరువైపుల లోయర్ ప్రామినెడ్, అప్పర్ ప్రామినెడ్, పార్కులు, ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ఫౌంటెన్, థీమ్ పార్కులు, మ్యూజికల్ ఫౌంటెన్, ఆటస్థలాలు, గార్డేన్, స్పీడ్ బోట్లు మరియు క్రోజ్ బోట్లతో కరీంనకర్ జిల్లా టూరిస్ట్ హబ్ గా ఎదగనుందని అన్నారు. బయటి రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, తరువాత తాను స్వయంగా చూసిన అనుభవాలను గురించి వివరించారు.
2009-10 లో మహరాష్ట్రా కు చెందిన సిరోంచ నుంచి కాళేశ్వరానికి చేరుకోవాలంటే వర్షా కాలం మినహ అన్ని రోజుల్లో సిరోంచ వరకు జీప్ లో వెళ్లి అక్కడి నుంచి బోట్ ద్వారా కాళేశ్వరం చేరుకోవాల్సి వచ్చేదన్నారు. ఇక సిరొంచ నుంచి హైదరాబాద్ రావాలంటే సిరొంచ నుంచి చంద్రాపూర్ మీదుగా ఆసిఫాబాద్ చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకోవాల్సి వచ్చేదన్నారు. ఈ ఒక్క ప్రయాణానికే దాదాపు 9 నుంచి 10 గంటల సమయం పట్టేదన్నారు. ప్రస్తుతం సిరొంచ నుంచి కాళేశ్వరం మీదుగా హైదరాబాద్ కు కేవలం నాలుగు గంటల్లో చేరుకుంటున్నామని తెలపారు.
ఈ మార్పు కేవలం ఎనమిదేళ్లలో కాలంలోనే జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టడం వల్ల వర్షాకాలం తప్ప మిగిలిన అన్ని కాలాల్లో అడుగంటిపోయిన భూగర్బ జాలాలతో బ్లాక్ జోన్ గా ప్రకటించిబడిన ప్రాంతాలు ఇప్పుడు 365 రోజులు 24 గంటల నీటి వసతిని అందించ గలుగుతున్నామని తెలిపారు. పత్తి, మొక్కజోన్న పండించే రైతులు కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మాణంతో కూరగాయలను పండిస్తు అధికంగా లాభాలను ఆర్జిస్తున్నారని అన్నారు.
గతంలో ఇదే ప్రాంతంలో రూ.4 లక్షలు పలికిన భూమి ధర ప్రస్తుతం రూ.20 నుంచి 25 లక్షలకు చేరిందంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజేక్టు నిర్మాణంతోనే జరిగిందన్నారు. తెలంగాణ మాదిరి ఇరిగేషన్ ప్రాజెక్టులు మరే రాష్ట్రంలో లేవన్నారు. పదేళ్లలో ఇంత పెద్ద స్థాయిలో ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టిన ఎకైక రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని కొనియాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొరకు ల్యాండ్ ఆక్వజేషన్ పనులను కేవలం ఆరు నెలల్లో పూర్తిచేసి ఇరిగేషన్ శాఖకు భూములను అందించాని తెలిపారు. ఇదే మరో చోటైతే రెండు నుంచి మూడేళ్ల కాలం పట్టేదన్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గురించి తెలుపుతూ.. ఖమ్మం జిల్లాలో పని చేసినప్పుడు తిరుమలపాలెం మండలంలో భూగర్భ జలాలు దాదాపు ఐదు వందల ఫీట్ల లోపలికి చేరుకొని డెడ్ స్టోరేజీకి వెళ్లిపోయాయని తెలిపారు. అక్కడ భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించి కృష్ణా నీటిని తీసుకురావడంతో, భూగర్బ జలాలు మళ్లీ పెరిగి అక్కడి చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా సాగు నీరు పెరిగిందన్నారు.
అదే విధంగా కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలంలో కూడా భూగర్భ జలాలు అడుగంటిన పరిస్థితుల నుంచి ఎల్.ఎం.డీ ప్రాజెక్టు ద్వారా ఆయకట్టులో మార్పులు చేపట్టడంతో అన్ని చెరువులు నిండు కుండలా మారిపోయాయన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఇంజనీర్ గా రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్న ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణ్ ను కలెక్టర్ సత్కరించారు.
]ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్.ఈ శివప్రసాద్, కరీంనగర్ ఆర్డీవో ఆనంద్ కుమార్, వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్, కరీంనగర్ ఎంపీపీ టి.లక్ష్మయ్య, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలత, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.