బాలికపై అత్యాచారం.. ఆపై చంపుతానంటూ..

by samatah |   ( Updated:2023-02-14 05:00:11.0  )
బాలికపై అత్యాచారం.. ఆపై చంపుతానంటూ..
X

దిశ, వీణవంక: రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కొందరు దారుణాలకు ఒడిగడుతున్నారు. వృద్ధుల నుంచి చిన్న పిల్లల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. తాజాగా వీణవంక మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్ రెడ్డి పై ఫోక్సో కేసు నమోదు అయినట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.అదే గ్రామానికి చెందిన బాలికను లొంగదీసుకొని శారీరకంగా వాడుకొని ఐదు నెలల గర్భవతి చేసాడని, విషయం బయటకు చెబితే తన కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇవి కూడా చదవండి : Crime News : మైనర్‌‌‌పై రెండు రోజులపాటు సామూహిక అత్యాచారం.. ఆ తర్వాత

Advertisement

Next Story