- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అక్రమ నిర్మాణాలపై రామగుండం బల్దియా కొరడా.. ఒకే రోజు 140 ఇండ్లు నేలమట్టం
దిశ,గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం నగరపాలక సంస్థ అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలుపించారు. గోదావరిఖని శివారు గంగానగర్ ఏరియాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి అనేక నాటకీయ పరిణామాల మధ్య అక్రమ కట్టడాలను నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ పర్యవేక్షణలో కూల్చివేతల పర్వం కొనసాగింది. ఈ సంఘటన నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఊహించని విధంగా బల్దియా అధికారులు ఇంతటి సాహసోపేతమైన చర్యకు ఉపక్రమించడం వెనక ఎవరెవరు ఉన్నారనేది చర్చ జరుగుతుంది. కాగా, గంగా నగర్ లోని సర్వే నెంబర్ 36, 37, 38 లోని 10 ఎకరాల్లో గల 350 ఇళ్లలో మంగళవారం దాదాపు 140 ఇండ్లను అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేయగా, బాధితులు ఇంట్లోని సామాగ్రి సర్దుకుని రోడ్డుకు ఎక్కారు. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఎస్టిపి ప్లాంటు నిర్మాణం పేరుతో అక్రమ కట్టడగాలను కూల్చివేశారు. తెల్లవారుజామునే మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఒక్కొక్క ఇల్లును కూల్చి వేస్తుండగా బాధితులు లబోదిబోమంటూ గుండెలు బాదుకున్నారు. సంఘటన స్థలంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఇండ్ల కూల్చివేత సమయంలో కొన్ని పార్టీ నాయకులు అక్కడే ఉన్నప్పటికీ ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
పైగా.. మరోచోట ఇండ్లు నిర్మించి ఇస్తారని హామీ ఇచ్చారంటూ బాధితులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా stp నిర్మాణం కోసం స్థలం ఎంత అవసరం ఉన్నది ? అనేది స్పష్టత లేదు. ఇదిలా ఉండగా ఒకరోజు ముందుగానే కొందరు నాయకులతో సమావేశమై అయినట్లు సమాచారం. కాగా ఇండ్ల నిర్మాణం సమయంలో బాధితులు ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు ఖర్చు చేయబోగా, ఇతర ఖర్చుల నిమిత్తం ఓ పార్టీ మహిళా నాయకురాలికి ఒక్కో ఇంటి నుంచి దాదాపు 30 వేల వరకు అప్పగించినట్లు బాధితులు వాపోయారు. భూ పోరాటం పేరుతో నిరుపేదలకు ఆశ చూపించి ఇండ్ల నిర్మాణం పేరుతో పెద్ద మొత్తంలోనే వసూలు జరగగా, ఇప్పుడు బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పుడు అక్కడ ఇండ్లు కోల్పోయిన బాధితులకు మరోచోట ఇల్లు నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ పార్టీ నాయకులు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా బాధితులకు న్యాయం జరగడం దేవుడెరుగు.. ఈ ఇండ్ల నిర్మాణం కూల్చివేత అంతా పథకం ప్రకారమే జరిగినట్లు చర్చ జరుగుతుంది.