‘అబద్ధాల కోరు అవినీతి చక్రవర్తి’.. కేసీఆర్‌పై మాజీ మంత్రి ఫైర్

by karthikeya |
‘అబద్ధాల కోరు అవినీతి చక్రవర్తి’.. కేసీఆర్‌పై మాజీ మంత్రి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరు అని, ఆయనో అవినీతి చక్రవర్తి అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రవీంద్రనాయక్ విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై అభినందించాల్సింది పోయి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో సకల ప్రభుత్వ సౌకర్యాలు పొందుతూ ఫాంహౌజ్ లో సేద తీరుతున్నాడని ఫైరయ్యారు. ప్రభుత్వం చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుని గతంలో తాము చేసిన అవినీతి అక్రమాల కేసుల నుంచి దృష్టి మళ్లించడానికి కేసీఆర్.. తన కొడుకు, అల్లుడిని ప్రభుత్వంపై ఎగదోస్తున్నాడని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని, తెలంగాణను ఏటీఎంలా మార్చుకున్నారని ప్రధాని మోడీతో సహా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపణలు చేశారని, మరి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రవీంద్ర నాయక్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుబంపై ఉచ్చు ఎందుకు బిగించలేదో సమాధానం చెప్పాలని, లేదంటే బీజేపీ నాయకులకు కేసిఆర్ అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్లుగానే భావించాల్సి వస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం దేశ భద్రతకు సంబంధించినదని, అయినా కేసీఆర్ సర్కార్ పై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర సంస్థలపై కనీసం ఒత్తిడి చేసే దమ్ము, ధైర్యం లేని దద్దమ్మలు బీజేపీ నాయకులని ఆయన విమర్శలు చేశారు. కేసీఆర్ పై చర్యలు తీసుకోవడం వెనుక ఆంతర్యమేంటని రవీంద్ర నాయక్ నిలదీశారు. లేదంటే కేంద్ర మంత్రులిద్దరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మూసీ బ్యూటిఫికేషన్ పై కనీసం డీపీఆర్ కూడా తయారుకాకముందే వారు విమర్శలు చేయడమేంటని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed