- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగి ఉన్న లారీని తప్పించబోయి ట్రాక్టర్ ను ఢీ కొట్టిన యువకుడు మృతి..
by Sumithra |
X
దిశ, కోదాడ : ఆగి ఉన్న లారీని తప్పించబోయి ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని గుడిబండ రోడ్లో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి గ్రామానికి చెందిన రాజపుత్ర గణేష్ (21) పని నిమిత్తం వచ్చి పట్టణంలోని భవాని నగర్ లో ఉన్న అక్క బావ ఇంట్లోనే ఉంటున్నాడు.
శనివారం ఇంటి వద్ద నుండి ఖమ్మం వెళ్లే క్రమంలో మేళ్లచెరువు వెళ్లే ప్రధాన రహదారి పై రోడ్డు ప్రక్కన ఉన్న లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు ట్రాక్టరును ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పోలీసు వారు పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలోనే ఓ వ్యక్తి డీసీఎం ఢీకొని చనిపోయినా పోలీసులు నిర్లక్ష్యంతోనే మరో యువకుడు బలైపోయాడు.
Advertisement
Next Story