- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Accident : ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి..
దిశ, సికింద్రాబాద్: వెనుక వైపు నుంచి వచ్చి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ద్విచక్రవాహనం పై వెళుతున్న యువతి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని తార్నాక ఫ్లైఓవర్ సమీపంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉప్పల్ ఆదర్శ నగర్ లో నివాసముండే రోహిత(25) సాఫ్ట్వేర్ ఉద్యోగి. రోహిత శనివారం ఉదయం మెట్టుగూడ నుంచి ఉప్పల్ వైపు తన ద్విచక్రవాహనంపై వెళుతోంది. తార్నాక జంక్షన్ దాటి రిలయన్స్ స్మార్ట్ బజార్ ముందు నుంచి వెళ్తుండగా కోఠి నుంచి కుషాయిగూడ వైపు వెళుతున్న కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆమె స్కూటీ ని బలంగా ఢీకొట్టింది. దీంతో రోహిత స్కూటీ అదుపు తప్పి కింద పడటంతో ఆమె బస్సు చక్రాల కింద పడిపోయి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీ ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఓయూ పోలీసులు తెలిపారు.