Voter List ప్రక్షాళనలో లక్షల ఓట్ల తొలగింపు.. సీఈవో సుదర్శన్ రెడ్డి సంచలన ప్రకటన

by karthikeya |
Voter List ప్రక్షాళనలో లక్షల ఓట్ల తొలగింపు.. సీఈవో సుదర్శన్ రెడ్డి సంచలన ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా నాలుగు లక్షల ఓట్లను తొలగించామని ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. 8 లక్షల మంది కొత్తగా ఓటర్లుగా నమోదు అయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలో 3.34 కోట్ల ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఓటర్ల తుది జాబితాను జనవరి 6 ప్రకటిస్తామని ఆయన తెలిపారు. శనివారం బీఆర్ కే ఆర్ భవన్ లో మీడియా సమావేశంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత నెల 29న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితాను ప్రకటించామని, ప్రస్తుతం తెలంగాణలో 3,34,26,323 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. యువ ఓటర్లు 4,73,838 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణలో 551 పోలింగ్ కేంద్రాలు పెరిగాయని, ప్రస్తుతం తెలంగాణలో 35,907 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రకటించిన ఓటరు జాబితపై అభ్యంతరాలను ఈనెల 28 వరకు స్వీకరిస్తామని, జనవరి 6న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు లేదని స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు.

హైదరాబాద్ లో అత్యధిక తొలగింపులు...

ఓటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా అత్యధిక ఓట్లను హైదరాబాద్ జిల్లాలో తొలగించారు. ఈ జిల్లాలో 1,29,880 ఓట్లను తొలగించారు. ఇందులో 7730 మంది చనిపోయారని, 22677 ఓటర్లు రెండు అంత కంటే ఎక్కువ సార్లు ఓటర్లుగా ఉన్నారని, మరో 99,379 మంది షిప్ట్ అయ్యారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తరువాత రంగారెడ్డి జిల్లాలో 58,120, మేడ్చల్ లో 34680, కరీంనగర్ జిల్లాలో 21,463, నల్గొండ జిల్లాలో 12,956 ఓట్లను తొలగించారు. కొత్త ఓట్ల నమోదులోనూ హైదరాబాద్ జిల్లా ముందుంది. ఈ జిల్లాలో 1.81లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదు అయ్యారు. రంగా రెడ్డి జిల్లాలో 1.18 లక్షల మంది, మేడ్చల్ జిల్లాలో 99696 కొత్త ఓటర్లుగా నమోదు అయ్యారు.

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు : 3,34,26,323

పురుష ఓటర్లు : 1,66,16,446

మహిళా ఓటర్లు : 1,68,07,100

ట్రాన్స్ జెండర్ ఓటర్లు : 2,777

సర్వీసు ఓటర్లు : 15,౯౪౮


యువ ఓటర్లు (18, 19 వయస్సు) - 4,73,838

సీనియర్ సిటిజన్స్ (85 సంవత్సరాలపైబడిన వారు)- 2,25,462

దివ్యాంగులు - 5,28,085

ఓవర్ సీస్ ఓటర్లు - 3578


రాష్ట్రంలో పొలింగ్ కేంద్రాలు : 35907

కొత్త పొలింగ్ కేంద్రాలు : 551

పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలు : 19,942

పట్టణాల్లో పోలింగ్ ప్రాంతాలు : 6,001

గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ప్రాంతాలు : 13,941


ఇంటింటి ఓటరు జాబితాలో భాగంగా కొత్తగా ఓట్ల నమోదు చేసిన వారు - 8,02,805

తొలగించిన ఓటర్లు - 4,14,165

సవరణలు, దిద్దుబాట్లు - 5,93,956

Advertisement

Next Story

Most Viewed