India : భారత్ మాకు ‘సైబర్ విరోధి’ : కెనడా

by Hajipasha |
India : భారత్ మాకు ‘సైబర్ విరోధి’ : కెనడా
X

దిశ, నేషనల్ బ్యూరో : కెనడా ప్రభుత్వం మరోసారి భారత్‌(India)పై విషం కక్కింది. సైబర్ భద్రతపరంగా భారత్‌ను తమ దేశానికి ముప్పుగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. ‘సైబర్ అడ్వర్సరీ’ (సైబర్ విరోధి) కేటగిరీలో భారత్‌ను చేరుస్తున్నట్లు కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం(Canada) వెల్లడించింది.

‘నేషనల్ సైబర్ థ్రెట్ అసెస్‌మెంట్ 2025-2026’ శీర్షికన కెనడా ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను ప్రస్తావించారు. కెనడా నిర్ణయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించారు. భారత ప్రతిష్ఠను దెబ్బతీసే దురుద్దేశంతోనే కెనడా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. కెనడా సైబర్ వ్యవస్థకు భారత్ నుంచి ముప్పు ఉందనేందుకు ఆధారాలేవీ లేవన్నారు.

Advertisement

Next Story