- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లిన టీచర్ పై చర్యలు తీసుకోవాలి.. పీడీఎస్ యూ
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మాక్లూర్ కేజీబీవీలో 6వ తరగతి చదువుతున్న సహస్ర అనే దళిత విద్యార్థినిని మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లిన టీచర్ గౌతమి రెడ్డి పై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ కె.నాగజ్యోతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ మాక్లూర్ కేజీబీవీలో సోషల్ సీఆర్టీగా పనిచేస్తున్న గౌతమిరెడ్డి తన బంగారు గొలుసు పోయిందనే నెపంతో సహస్ర అనే 6వ తరగతి విద్యార్థినిని నిజామాబాద్, మాలపల్లిలో గల ఫకీరు దగ్గరికి తీసుకెళ్లి మంత్రాలు (అంజనం) చేయించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిందన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ భావజాలాన్ని పెంచాల్సిన టీచర్లే, ఇలా మూఢనమ్మకాలను ఆశ్రయించడం దారుణమన్నారు.
ఈ ఘటన పై అన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో కథనాలు వచ్చాయని, అయినప్పటికీ ఈ ఘటనకు ప్రధాన బాధ్యురాలైన సీఆర్టీ గౌతమిపై ఉన్నతాధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. ఈ జాప్యానికి ఒక ఉపాధ్యాయ సంఘం నేత, ఎస్.ఎస్.ఏ అధికారిణిల పైరవీలే కారణమని ఆరోపించారు. తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా పైరవీలతో దోషులను కాపాడే కుట్రలు చేస్తే, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులైన టీచర్ గౌతమిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇలాంటి మూఢనమ్మకాలను, అశాస్త్రీయ భావజాలాన్ని, దుర్ఘటనలను నియంత్రించాలని, సైన్సు, శాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించేలా జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలలో తగు ఏర్పాట్లు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు రమేష్, సతీష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.