gift : రాజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే చీర బహుమానం

by Sridhar Babu |
gift : రాజన్నకు అగ్గిపెట్టెలో ఇమిడే చీర బహుమానం
X

దిశ, వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్ కుమార్ అగ్గిపెట్టెలో ఇమిడే శాలువాతో పాటు చీరను బహుమానంగా అందజేశాడు. తానే స్వయంగా నేసిన వీటిని మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆలయ ఈఓ కె. వినోద్ రెడ్డికి అందజేశారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు విజయ్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. వారి వెంట ఈఓ సీసీ ఎడ్ల శివ, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story