విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

by Sridhar Babu |
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
X

దిశ,పెగడపల్లి : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సూచించారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను కలియ తిరిగి చూశారు. విద్యార్థులతో మాట్లాడుతూ వారికి అందజేస్తున్న భోజనం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా సకాలంలో సిలబస్ పూర్తి చేసి వచ్చే పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధనకు కృషి చేయాలని సూచించారు.

రైతులు అప్రమత్తంగా ఉండాలి..

అనంతరం మండలంలోని అయితుపల్లి గ్రామంలో ఐకేపీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్ష సూచన ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఆరబెట్టిన ధాన్యాన్ని తేమ శాతం లేకుండా కొనుగోళ్లు జరపాలని, అవసరమైన గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మధుసూదన్, డీఈఓ రాము, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, మండల విద్యాధికారి సులోచన, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed