- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలు
దిశ, సుల్తానాబాద్ : సీసీఐ ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. సుల్తానాబాద్ మండలం సుగులాంపల్లి శివారులోని వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లు, పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో మహాలక్ష్మి జిన్నింగ్ మిల్లులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను స్థానిక నాయకులతో బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...సీసీఐ కోనుగోలు కేంద్రాల ద్వారా నాణ్యమైన పత్తికి క్వింటాకు రూ.7521 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలో 4 లక్షల క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి, సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.
పెద్దపల్లి నియోజకవర్గంలో 3 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరిస్తారని చెప్పారు. 8 నుంచి 12 వరకు మ్యాచర్ తో పత్తిని తీసుకువస్తే క్వింటాకు రూ. 7,500 లు ప్రభుత్వ మద్దతు ధర పొందవచ్చని అన్నారు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. అలాగే సన్న వడ్లకు క్వింటాకు రూ.5 వందల చొప్పున బోనస్ చెల్లిస్తామని అన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అటు వడ్లు, ఇటు పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమను నేరుగా సంప్రదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మార్కెట్ వైస్ చైర్మన్ లు, సింగిల్ విండో చైర్మన్లు మాదిరెడ్డి నర్సింహారెడ్డి, ఆళ్ల సుమన్ రెడ్డి, మార్కెట్, సింగిల్ విండో డైరెక్టర్లు, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి పృథ్వీ రాజ్, పెద్దపల్లి విండో సీఈఓ మధన్ మోహన్, పత్తి మిల్లు యజమాని శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్, అబ్బాయి గౌడ్, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.