జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను రెగ్యులర్ చేయాలి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్

by Sumithra |
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను రెగ్యులర్ చేయాలి.. ఎమ్మెల్యే ఈటల రాజేందర్
X

దిశ, హుజూరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం ముందు డివిజన్ లోని జూనియర్ కార్యదర్శులు ఆదివారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వారు చేపట్టిన నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల ప్రొహిబిషన్ కాలాన్ని మూడేళ్లకు పెంచి కార్యదర్శుల పోస్టులను క్రమబద్ధీకరించకుండా వారి జీబితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని విమర్శించారు.

9వేల మందికి పైగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాల్లో చేరగా దాదాపు 50 మంది వివిధ కారణాలతో మృతి చెందారన్నారు. ఇప్పటి వరకు వారి ఉద్యోగాలు రెగ్యులర్ కాకపోవడంతో ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ, సహకారాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెల ప్రగతి కోసం కార్యదర్శులు చేసిన సేవలతోనే రాష్ట్రానికి అవార్డులు వస్తున్నాయన్న విషయాన్నీ ప్రభుత్వం గుర్తించాలన్నారు. తక్షణమే జూనియర్ కార్యదర్శుల ఉద్యోగాలను రెగ్యులర్ చేసి, ప్రభుత్వం తరపున రావాల్సిన అన్ని బెనిఫిట్స్ అందజేయసాలని ఈటల డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed