- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణా సాకారం..ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్
దిశ, హుజూరాబాద్ : కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ ప్రజల కల సాకారమవుతుందని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బల్మూరి వెంకట్ అన్నారు. టీపీసీసీ పిలుపు మేరకు వెంకట్ ఆద్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా వెంకట్ మాట్లాడుతూ ఓటమి భయంతోనే కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. 9 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి చేసింది శూన్యమన్నారు.
ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా దశాబ్ది ఉత్సావాల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. దశాబ్ది దగా పేరిట సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసినట్లు తెలిపారు. పక్క నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రజా సమస్యలను పట్టించుకొని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ కార్యకరలను అడ్డుకున్న పోలీసులు..
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ర్యాలీగా వస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తహసీల్దార్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశం కొనసాగుతుండటంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడంతో వారి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. సమావేశం ముగిసిన వెంటనే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు అక్కడి నుండి వెళ్ళిపోయాక కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి, కొల్లూరు కిరణ్, గూడూరి స్వామి రెడ్డి , సొల్లు బాబు, తిప్పారపు సంపత్ , చరణ్ పటేల్ , శ్యాంసుందర్ రెడ్డి , రామారావు, రామకృష్ణ ,రాజేశ్వరావు, వెంకన్న , ఐలయ్య , ఎండీ పాషా, మహిళ సుశీల, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.