ఎస్బీఐ పేరుతో లింక్.. ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్..

by Sumithra |
ఎస్బీఐ పేరుతో లింక్.. ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్..
X

దిశ, మల్యాల : మల్యాల మండలంలో పలు వాట్సప్ గ్రూపులలో ఎస్బీఐ పేరుతో కేవైసీ లింకులు రావడంతో అందరూ షాక్ కు గురవుతున్నారు. ఎస్బీఐ అకౌంట్ లేనివారికి సైతం ఎస్బీఐ పేరుతో కేవైసీ చేసుకోవాలని లేదంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని, వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చెక్కలు కొడుతోంది. వాట్సప్ గ్రూపులలో ఎవరి పేరుతో ఆ లింక్ వచ్చిందో ఆ వ్యక్తికి ఫోన్ చేసి కొందరు వ్యక్తులు విచారించగా ముత్యంపేట గ్రామానికి చెందిన మధు అనే యువకుడి ఫోన్ హాక్ అయినట్లు తెలిపారు. తన నెంబర్ నుండి ఎలాంటి మెసేజ్ లు కానీ లింకులు కానీ వచ్చినట్లయితే వాటిని ఓపెన్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉన్నట్లు అలాంటి లింకులను డిలీట్ చేయాలని ఆయన పలువురికి తెలిపినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed