- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీహెచ్ సీ పనులు పూర్తి చేయాలి
దిశ,చందుర్తి : చందుర్తి మండల కేంద్రంలోని పీహెచ్ సీ నూతన భవనం తుది దశ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. చందుర్తి మండల కేంద్రంలో రూ.కోటి 56 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులను రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టగా కలెక్టర్ తనిఖీ చేశారు.
భవనంలోని అన్ని గదులు, ఆవరణను పరిశీలించారు. దవాఖాన ఆవరణను మొత్తం శుభ్రం చేయించాలని ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. భవనంలో తుది దశ పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. పాత భవనం నుంచి నూతన భవనంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యాధికారి సంపత్ కు సూచించారు.
విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలి
విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని టీచర్లను కలెక్టర్ ఆదేశించారు. రుద్రంగిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. వారిని వివిధ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు. అనంతరం కిచెన్, స్టోర్ రూం పరిశీలించారు. మెనూ ప్రకారం ఏఏ ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారో తనిఖీ చేశారు.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, వారు అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యాలయానికి ప్రహరీ నిర్మించాలని కలెక్టర్ కు విద్యాలయం బాధ్యులు విన్నవించారు. ఈ పర్యటనలో ఆర్అండ్ బీ డీఈ శాంతయ్య, డీఈఓ రమేష్ కుమార్, టీచర్ వనిత తదితరులు పాల్గొన్నారు.