- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యం సీజ్
దిశ, జగిత్యాల కలెక్టరేట్ : రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని సివిల్ సప్లై అండ్ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో గల శ్రీ ఆంజనేయ రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారం మేరకు చేపట్టిన ఈ దాడుల్లో మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన పది క్వింటాళ్ల రైస్, 160 క్వింటాళ్ల నూకలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రైస్ మిల్లు పై కేసు నమోదు చేసిన ఆఫీసర్లు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే జగిత్యాల జిల్లాలో కొన్నేళ్లుగా అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని కొన్ని రైస్ మిల్లుల్లో యజమానులు నూకలుగా మార్చి లిక్కర్ డిస్టలరీలకు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరైతే ఏకంగా పాలిష్ చేసి సొంత బ్రాండింగ్ లేబుల్స్ వేసి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం.