ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలను ఖండించిన పాస్టర్లు

by Shiva |   ( Updated:2023-06-07 15:27:18.0  )
ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలను ఖండించిన పాస్టర్లు
X

దిశ, జమ్మికుంట : ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు క్రైస్తవులపై చేసిన వ్యాఖ్యలను జమ్మికుంట మండల క్రైస్తవులు తీవ్రంగా ఖండించారు. బుధవారం జమ్మికుంట పట్టణంలో న్యూ విజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు పాస్టర్లు మాట్లాడారు. ఆదిలాబాద్ ప్రాంత క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని మీ గుండెల్లో బుల్లెట్లు దింపుతానని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. ఎంపీ సోయం బాబూరావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్రైస్తవ సోదరులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో న్యూ విజన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు అశోక్, ప్రధాన కార్యదర్శి జయరాజు, కోశాధికారి ప్రసాద్ లతో పాటు పాస్టర్లు, క్రైస్తవ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed