- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
లేకలేక పుట్టిన సంతానం...అంతలోనే ఆనందం ఆవిరి
దిశ,గొల్లపల్లి : రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. రోజువారి కూలిపని చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నారు. ఆ దంపతులకు ఐదు నెలల క్రితం బాబు జన్మించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ ఆ ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఆ చిన్నారి ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది.
మండల కేంద్రానికి చెందిన కంచెర్ల సంతోష్, వర్షిణి దంపతులకు ఐదు నెలల క్రితం బాబు జన్మించగా బాబుకి జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాబుని పరీక్షించిన వైద్యులు జ్వరం మెదడుకు వ్యాపించిందని, చికిత్స చేయకుంటే ప్రాణాలు దక్కవని డాక్టర్లు తెలపడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చికిత్సకు అవసరమైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయం చేసే దాతలు 9505043919/9505607377 నంబర్లని సంప్రదించి తమ బాబు ప్రాణాలను కాపాడాలని వేడుకుంటున్నారు.