- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంగమాన్ దొడ్డిలో వాల్మీకి మహర్షి విగ్రహం ప్రతిష్ట
దిశ, గట్టు: మండల పరిధిలోని గంగామాన్ దొడ్డి గ్రామంలో గురువారం వాల్మీకి నూతన దేవాలయం నిర్మాణం చేసి వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాల్మీకి మహార్షిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అలాగే వాల్మికి మహర్షి రామాయణ రచయిత ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని బీఅర్‌యస్ నాయకురాలు, మాజీ జడ్పిటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు అన్నారు. వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో అయా గ్రామాలలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మహర్షి విగ్రహానికి పూలమాల వేసి, పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సాహిత్యానికి ఆద్యుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన రామాయణాన్ని అందించిన వాల్మీకి అడుగుజాడల్లో పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం నాయకులు, యస్ రాము, నర్సింములు, వెంకటన్న, తిమ్మప్ప, కొళాయి భాస్కర్, కత్తి విరన్న, నల్లరెడ్డి గొపాల్, అయా గ్రామలనాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.