కూల్చివేతకు చిరు వ్యాపారులే అర్హులు.. బడా వ్యాపారులకు కూల్చివేతలు ఉండవా..

by Disha Web Desk 23 |
కూల్చివేతకు చిరు వ్యాపారులే అర్హులు.. బడా వ్యాపారులకు కూల్చివేతలు ఉండవా..
X

దిశ, గోదావరిఖని: రాజు తలచుకుంటే దెబ్బలకు కొదమ అన్న చందంగా ఉంది.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే మాకేంటి.. స్థానికంగా ముఖ్య నాయకులకు దగ్గర ఉండే స్నేహితులు ఉంటే చాలు.. అధికారులు తలుచుకుంటే పేదోడి దుకాణం ఉండదు… అనే విధంగా ఉంది.. అభివృద్ధి పేరుతో రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపట్టారు. మొదట పేదోడి గుడిసెనే పీకడం మొదలుపెట్టారు. కోట్ల రూపాయల భవంతులు ఉన్న బడా వ్యాపారుల నుంచి మొదటిగా ఎందుకు మొదలు పెట్టలేదు అనేదే ఇక్కడ అధికారులను వేధిస్తున్న ప్రశ్న.

చిరు వ్యాపారులకు ఒక న్యాయం.. బడా వ్యాపారులకు ఒక న్యాయమా..

పేదోడు పేదోడిలా ఉంటాడు.. బలిసినోడు బలిసినట్టుగా ఉంటాడు.. అన్న చందంగా రామగుండం కార్పొరేషన్ లో అభివృద్ధి జరిగే లక్ష్మీ నగర్ ప్రాంతంలో రోడ్డు పక్కన చిన్నచితక వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల గూడును కూల్చివేస్తున్న ప్రస్తుత ప్రభుత్వ అధికారుల తీరు కనిపిస్తుంది. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి ప్రతి ఒక్కరికి అవసరమే కానీ.. చిరు వ్యాపారులకు ప్రత్యాన్మాయంగా వ్యాపార స్టాల్స్ ఏర్పాటు చేసి తనంతరం రోడ్డు వెడల్పు కార్యక్రమాలను మొదలు పెట్టాలని వ్యాపారుల డిమాండ్ చేస్తున్నారు. ఇదే లక్ష్మీ నగర్ ప్రాంతంలో రోడ్డు ఓ కార్పొరేటర్, బడా వ్యాపారులు పెద్దపెద్ద భవంతులు కట్టుకొని వేల రూపాయల అద్దెలు తీసుకుంటూ వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పెద్ద వ్యాపార భవనాల జోలికి మాత్రం అధికారులు మాత్రం వెళ్లడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.

అదేవిధంగా బడా వ్యాపారుల వ్యాపార సమయంలోనే అక్రమంగా రోడ్డుకు ఆనుకొని పెద్దపెద్ద భవంతులు కట్టి లక్షల రూపాయల అద్దె వసూలు చేస్తున్నారు. వాటిని మాత్రం ముట్టుకోకపోవడం పట్ల విమర్శలకు దారితీస్తుంది.

అంబులెన్స్ వెళ్ళాలంటే కష్టమే..

లక్ష్మీ నగర్ ప్రధాన కూడలిలో అంబులెన్స్ వెళ్ళాలంటే కష్టతరంగా మారుతుంది. ప్రధానంగా ఆస్పత్రులు ఉన్న ఈ రోడ్డులో ఇరుకు గల్లీలు ఎక్కువగా ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డింగులు ఉండి.. మధ్యలో పార్కింగ్ ఉండడంతో అక్కడ నడవడానికే ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ రోడ్డులో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ట్రాఫిక్ తో ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. ప్రధాన ఆస్పత్రులు ఉండడం వలన ఈ రోడ్డును కూడా 60 ఫీట్లకు పెంచాలని డిమాండ్ వస్తుంది.

ఎమ్మెల్యే స్పందించాలని కోరుతున్న ప్రజలు...

ప్రధాన వ్యాపార కేంద్రంలో కూడా రోడ్డు విస్తరణ జరిపి ప్రజలకు అనుకూలమైన విధంగా చేయాలని రామగుండం ఎమ్మెల్యేను స్థానిక ప్రజలు కోరుతున్నారు. చుట్టూ ఉన్న ప్రాంతం విస్తరిస్తున్న క్రమంలో.. ఆస్పత్రుల లైన్ విస్తరించి ఇబ్బందులు తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Next Story

Most Viewed