- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై నార్త్ సెంట్రల్ బీజేపీ అభ్యర్థిగా ముంబై టెర్రర్ ఎటాక్ ప్రాసిక్యూటర్
దిశ, నేషనల్ బ్యూరో: ముంబై నార్త్ సెంట్రల్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ముంబై టెర్రర్ ఎటాక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దేవరాయ్ నికమ్ బరిలో దిగనున్నారు. ప్రస్తుతం లోక్ సభ ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో ఉజ్వల్ దేవరాయ్ నికమ్ ను బరిలో దింపింది బీజేపీ హైకమాండ్.
2014, 2019లో పూనమ్ మహాజన్ ముంబై నార్త్ సెంట్రల్ నుంచి విజయం సాధించారు. ముంబయి ఉగ్రదాడుల కేసులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు ఉజ్వల్ నికమ్. సిట్టింగ్ ఎంపీని భర్తీ చేయాలనే ఊహాగానాలు వస్తుండగా.. ఆమె స్థానంలో ఉజ్వల్ నికమ్ ను నియమించింది బీజేపీ. కాగా.. అదే స్థానం నుంచి ధారవి ఎమ్మెల్యే వర్ష గైక్వాడ్ ను ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ నామినేట్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన రెండ్రోజులకే బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది కాషాయ పార్టీ.
మహారాష్ట్రలో మొత్తం 48 ఎంపీ స్థానాలు ఉండగా.. తొలి, రెండో శలో 13 స్థానాలకు పోలింగ్ జరిగింది. మరో మూడు దశల్లో మిగతా స్థానాలకు పోలింగ్ జరగనుంది. 2019లో బీజేపీ 23 స్థానాల్లో గెలుచుకోగా.. శివసేన 18 స్థానాల్లో గెలిచింది.