ఆ ఆయుధాలను సీబీఐ, ఎన్ఎస్‌జీ‌లే అమర్చాయేమో.. ఈసీకి ఫిర్యాదు

by Hajipasha |
ఆ ఆయుధాలను సీబీఐ, ఎన్ఎస్‌జీ‌లే అమర్చాయేమో.. ఈసీకి ఫిర్యాదు
X

దిశ, నేషనల్ బ్యూరో : పోలింగ్ రోజున బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో సీబీఐ రైడ్స్ చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకున్న వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల వేళ తమ ప్రభుత్వం ప్రతిష్ఠను దెబ్బతీయడానికి సీబీఐ ఈ దాడి చేసి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసింది. ‘‘పోలింగ్ రోజున(ఏప్రిల్ 26న) సందేశ్‌ఖాలీలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు రైడ్స్‌లో భాగంగా దొరికినవేనా ? లేదంటే వాటిని సీబీఐ/ఎన్‌ఎస్‌జీలు రహస్యంగా అమర్చి.. ఆ తర్వాత వెళ్లి స్వాధీనం చేసుకున్నాయా ?’’ అనేది తేల్చాలని ఎన్నికల సంఘాన్ని దీదీ సర్కారు కోరింది. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమని తెలిసినప్పటికీ.. కనీస సమాచారం ఇవ్వకుండానే సీబీఐ ఈ రైడ్స్ చేసిందని ఆరోపించింది. రాష్ట్ర పోలీసుల దగ్గర కూడా బాంబు నిర్వీర్య స్క్వాడ్‌ ఉందని బెంగాల్ ప్రభుత్వం గుర్తు చేసింది.

Advertisement

Next Story

Most Viewed