Flood : ప్రమాదం అంచున మాటు కుంట కట్ట

by Aamani |   ( Updated:2024-07-21 09:45:24.0  )
Flood :  ప్రమాదం అంచున మాటు కుంట కట్ట
X

దిశ,కొడిమ్యాల : జగిత్యాల జిల్లా, కొడిమ్యాల మండల కేంద్రం నుండి సూరంపేట కు వెళ్లే దారిలో కోనాపూర్ గ్రామ శివారులో మాటుకుంట కట్ట కోతకు గురై ప్రమాదకరంగా తయారైంది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు కట్ట కోతకు గురవడంతో సూరంపేట, గంగారం తండా గ్రామల తో పాటు మేడిపల్లి, కథలాపూర్ మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గత సంవత్సరం కోతకు గురైన కట్ట కు అప్పటి పాలకులు,అధికారులు నామమాత్రపు చర్యలు చేపట్టి తాత్కాలిక మరమ్మతులు చేసి రోడ్డును పునరుద్ధరించారు. కాగా గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మాటు కుంట కట్ట తిరిగి ప్రమాదంలో పడింది. అధికారులు సకాలంలో స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. లేనియెడల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటరని శాశ్వత ప్రాతిపదికన తొందరగా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story