మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. ప్రభుత్వ అధికారులు

by Sumithra |
మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. ప్రభుత్వ అధికారులు
X

దిశ, సైదాపూర్ : మాదే ఆఫీసు మా ఇష్టం వచ్చిన సమయాని వెళ్తాం, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. అని కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు తమకు ఇష్టం వచ్చిన సమయంలో వస్తూపోతూ ఉంటారు. ఉదయం 10గంటలకు రావలసిన ఉద్యోగులు 11 గంటలు అవుతున్నా ప్రభుత్వ కార్యాలయానికి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 అవుతున్న అధికారులు లేక కాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. మండలంలో ఏపని జరగాలన్న మండల ప్రజలు మండల పరిషత్ కార్యాలయానికి వెళ్తుంటారు. కానీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు ఉదయం 11 గంటలైనా అధికారులు కార్యాలయానికి రాకపోవడంతో ఆఫీస్ కు పనిమీద వచ్చిన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 11 గంటలవుతున్నా కార్యాలయంలో అధికారులు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.

దీంతో వివిధ రకాల పనుల నిమిత్తం వచ్చిన ప్రజలకు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సమయపాలనతో పాటు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సమయ పాలన పాటించకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయమే కదా తమ ఇష్టం వచ్చిన సమయాని రావచ్చు, వెళ్లవచ్చని ధీమాతో ఉద్యోగులు ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉదయం 11 అవుతున్న మండల పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయంటే ఈ శాఖలోని అధికారుల నిర్లక్ష్యంఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సమయ పాలన పాటించని ఉద్యోగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు జిల్లా అధికారులను కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed