Aadhaar operator : ఈ - పీఎఫ్, ఈఎస్ఐ అడిగినందుకు ఉద్యోగం నుంచి తొలగింపు..

by Sumithra |
Aadhaar operator : ఈ - పీఎఫ్, ఈఎస్ఐ అడిగినందుకు ఉద్యోగం నుంచి తొలగింపు..
X

దిశ, రామగిరి : ఈ-పీఎఫ్, ఈఎస్ఐ, అదనపు జీతం అడిగినందుకు ఉద్యోగం నుంచి తొలగించారని ఆధార్ ఆపరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. రామగిరి మండలం సెంటనరీ కాలనీకి చెందిన ఆధార్ ఆపరేటర్ బాలసాని దేవరాజ్ గౌడ్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సెంటనరీ కాలనీ ఎస్బీఐ బ్యాంకులో హైదరాబాద్ కి చెందిన బ్లూత్రీ ఐటీ సొల్యూషన్స్ సంస్థ ద్వారా ఆధార్ అప్డేట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 2018 నుండి పని చేస్తున్నానని, తనకు రావాల్సినవి అడిగినందుకు 2023 నవంబర్ లో తొలగించారని అన్నారు.

ఈ విషయంపై కరీంనగర్ లేబర్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. దీనికి తోడు హైదరాబాద్ లోని ఈ-పీఎఫ్ కార్యాలయంలో, రాష్ట్ర కార్మిక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎస్బీఐ బ్యాంకు కార్పోరేట్ కార్యాలయంకు మెయిల్స్ చేశానని, బ్లూత్రీ ఐటీ సొల్యూషన్స్ సంస్థకు ఫోన్ చేసిన స్పందించట్లేదని వివరించారు. గత ఆరు నెలలుగా ఎన్ని ఫిర్యాదులు చేసిన పట్టించుకోపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed