- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిల్లపల్లికి ఎన్పీఏ అవార్డు
దిశ,మంథని : మంథని మండలం చిల్లపల్లి గ్రామానికి జాతీయ పంచాయతీ అవార్డు వరించింది. ఈ అవార్డును జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణశ్రీ తో కలిసి పాల్గొన్నారు. 2022-23వ సంవత్సరంలో మహిళా ఫ్రెండ్లీ పంచాయతీలలో దేశంలోనే మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయతీ ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది.
గ్రామంలోని ఆరు సంవత్సరాల పిల్లలందరినీ ఐసీడీఎస్ లో రిజిస్టర్ చేయడం, గ్రామ సభలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం, స్వశక్తి మహిళా సంఘాలకు రుణాలు అందడం, మాతా శిశు మరణాలు సున్నా కు తగ్గడం, బాలికల విద్య ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు అమలు చేసినందుకు చిల్లపల్లి ఉత్తమ గ్రామంగా ఎంపికైంది. ఉత్తమ మహిళా ఫ్రెండ్లీ గ్రామంగా ఎంపికైన చల్లపల్లి గ్రామానికి 65 లక్షల రూపాయల నగదు బహుమతి వచ్చిందని, ఈ నిధులను గ్రామ అభివృద్ధికి వినియోగించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తులో ఇదే రీతిలో మహిళల అభ్యున్నతి కోసం గ్రామంలో పనులు జరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వీర బుచ్చయ్య, జెడ్పీ సీఈఓ నరేందర్రెడ్డి, డీఆర్డీఓ రవీందర్, డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్ కుమార్, ఎంపీడీఓ పూర్ణ చందర్ రావు, మండల పంచాయతీ అధికారి శేషాసూరి, డీపీఎం రజాక్, పంచాయతీ కార్యదర్శి రాం కిషోర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.